గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 15:42:58

కరోనా నిబంధనలు వీరికి ఉండవా?

కరోనా నిబంధనలు వీరికి ఉండవా?

భోపాల్‌: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్‌ రావడానికి మరో ఏడాది పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పటివరకు సోషల్‌ డిస్టెన్స్‌ వ్యాక్సిన్‌ అంటే భౌతిక దూరం పాటించడమనే వ్యాక్సిన్‌ ఒకటే ఔషధమని వైద్యనిపుణులు ఎంతగా మొత్తుకొంటున్నా చాలా మంది పట్టించుకోవడం లేదు. దాంతో ఏరోజుకారోజు కొవిడ్‌-19 వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరిగిపోతున్నది. భౌతిక దూరం, ముఖానికి మాస్క్‌ పెట్టుకోవడం వల్లనే కరోనా వ్యాపించకుండా చూసుకోవచ్చు.

ఇదిలాఉండగా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సాగర్‌ జిల్లాలో జైన మతస్థులు మాత్రం తమకు ఈ నిబంధనలు ఏవీ పట్టవు అన్నట్లుగా వ్యవహరించారు. జైన సన్యాసి ప్రమాన్సాగర్‌, తన 20 మంది అనుచరులతో బండా ప్రాంతానికి చేరుకొన్నారు. ఆయనకు స్వాగతం  చెప్పేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన జైన మతస్థులు గుమిగూడారు. అయితే, ముఖానికి మాస్క్‌లుగానీ, భౌతికదూరం పాటించాలన్న కనీస పరిజ్ఞానాన్ని మరిచి ప్రవర్తించారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి జైన సన్యాసికి స్వాగతం పలికిన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.


logo