శనివారం 11 జూలై 2020
National - Jun 16, 2020 , 11:58:00

ప్ర‌కృతిని కాపాడుతున్న కాకి!

ప్ర‌కృతిని కాపాడుతున్న కాకి!

ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త. ఇది చెప్ప‌డ‌మే కాని చేసేవాళ్లు త‌క్కువ‌. మ‌నుషులు చేయాల్సిన చాలా ప‌నుల‌ను వ‌న్య‌ప్రాణులు చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ప‌రిశుభ్ర‌త ప‌ట్ల నిర్లక్ష్యం వ‌హిస్తున్న మ‌నుషుల‌కు కాకి వీడియో బాధ్య‌త‌ను గుర్తు చేస్తుంది. 11 సెకండ్ల పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ ఆఫీస‌ర్ సుశాంత్ నంద ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. 

ఈ కాకి చేసిన ప‌నిని మ‌నుషులు చేయ‌లేరా? అనే శీర్షిక‌తో నంద ట్యాగ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్‌మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. ఈ వీడియో పాత‌దే అయిన‌ప్ప‌టికీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉప‌యోగ‌ప‌డుతుంది అంటున్నారు. పార్కులో నేల మీద ప‌డేసిన బాటిల్‌ను ఒక కాకి నోటితో ప‌ట్టుకొని ప‌సుపు రంగు గ‌ల డ‌స్ట్‌బిన్‌లో వేసి ఎగిరిపోయింది. దీనిపై నెటిజ‌న్లు కామెంట్ల రూపంలో త‌మ బావాల‌ను తెలియ‌జేస్తున్నారు. 


logo