సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 04, 2020 , 18:54:58

మొస‌లి దెబ్బ‌కు ఖంగుతిన్న సింహం.. దెబ్బ‌కు ప‌రార్‌!

మొస‌లి దెబ్బ‌కు ఖంగుతిన్న సింహం.. దెబ్బ‌కు ప‌రార్‌!

ఎప్పుడూ సింహాలే మిగిలిన జంతువుల‌కు జ‌ల‌క్ ఇస్తుంటారు. కానీ ఈ సారి మొస‌లి వంతైంది. బ‌య‌ట ఎంత రారాజైనా ఒక‌సారి నీటిలోకి దిగితే మొస‌లి దెబ్బ‌కు త‌ల వంచాల్సిందే. అ విష‌‌యం సింహానికి తెలుసో లేదో కాని కాసేపు నీటిలో జ‌ల‌కాలాడుదామ‌నుకున్న‌ది. అలా ఒడ్డు నుంచి నీటిలోకి దిగింది. నీటి మ‌ధ్య‌లోకి రాగానే వెన‌క‌నే మొస‌లి వ‌చ్చి సింహాన్ని వాటేసుకున్న‌ది.

ఒక‌సారి మొస‌లి నోటికి చిక్కితే కాపాడ‌డం ఆ దేవుడి త‌రం కూడా కాదు. కానీ ఈ సింహం మాత్రం జారుకొని బ‌య‌ట ప‌డింది. మొస‌లి ప‌ట్టు త‌ప్ప‌డంతో సింహం ప్రాణాలు ద‌క్కించుకున్న‌ది. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. అబ్బా ఎప్పుడూ ఎప్పుడూ సింహాలు వేటాడ‌మే కాని సింహాన్ని వేటాడే జీవే లేద‌నుకున్నాం. ఈ రోజు ఆ ముచ్చ‌ట కూడా తీరందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo