సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 11:07:35

మ‌రోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రిమిన‌ల్‌

మ‌రోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రిమిన‌ల్‌

పాట్నా : బీహార్ శాస‌న‌స‌భ‌కు పోటీ చేసిన అభ్య‌ర్థుల్లో అనంత్ సింగ్ ఒక‌రు. ఆయ‌న‌పై 67 క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయ్యాయి. మోకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ త‌ర‌పున పోటీ చేసి.. జేడీయూ అభ్య‌ర్థి రాజీవ్ లోచ‌న్ నారాయ‌ణ్‌పై గెలుపొందారు. 2015 ఎన్నిక‌ల్లో మోకామా స్థానం నుంచి అనంత్ సింగ్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు.  ఆయ‌న ఇంట్లో ఏకే 47 తుపాకీ ల‌భ్యం కావ‌డంతో జైలు పాల‌య్యారు. 2015 ఎన్నిక‌ల కంటే ముందు పాట్నాలోని అనంత్ సింగ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌గా, ఆరు మ్యాగ‌జైన్లు, రైఫిల్స్, ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటిన దుస్తులు బ‌య‌ట‌పడ్డాయి. వీటితో పాటు కిడ్నాప్, హ‌త్య కేసుల్లో అనంత్ జైలుకు వెళ్లి వ‌చ్చాడు. అనంత్ సింగ్‌ను స్థానికంగా చోటే స‌ర్కార్ అని పిలుస్తారు. అనంత్ సింగ్ తొలిసారిగా 2005లో మోకామా నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత 2015, 2020 ఎన్నిక‌ల్లో గెలిచారు. ఎన్నిక‌ల ఆఫిడ‌విట్ ప్ర‌కారం.. అనంత్ సింగ్ ఆస్తులు 68.6 కోట్లు. స్థిరాస్తులు రూ. 18.5 కోట్లు, చరాస్తులు రూ. 50.1 కోట్లు. ఇక సోష‌ల్ వ‌ర్క్, బిజినెస్, అగ్రిక‌ల్చ‌ర్ చేస్తాన‌ని ఆఫిడ‌విట్‌లో అనంత్ సింగ్ ప్ర‌క‌టించుకున్నారు. త‌న‌పై 67 క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు.