సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 16, 2020 , 17:53:38

జార్ఖండ్‌లో దోపిడీ, హత్య, అత్యాచార నేరాలు పెరిగాయి: లోక్‌సభలో బీజేపీ ఎంపీ

జార్ఖండ్‌లో దోపిడీ, హత్య, అత్యాచార నేరాలు పెరిగాయి: లోక్‌సభలో బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో దోపిడీ, హత్య, అత్యాచార నేరాలు బాగా పెరిగాయని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దుబే ఆరోపించారు. కరోనా కాలంలో ఇది మరింత పెరిగిందని, 75 వేలకుపైగా నేర సంబంధ కేసులు నమోదయ్యాయని విమర్శించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఇంచార్జి డీజీపీ నియమితులయ్యారని, జార్ఖండ్‌లో శాంతిభద్రతలు గాడి తప్పాయని దుబే ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభాన్ని కేంద్ర హోంశాఖ నివారించాలని కోరుతున్నట్లు లోక్‌సభలో ఆయన చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo