సోమవారం 30 మార్చి 2020
National - Mar 09, 2020 , 17:21:38

16లోగా వాడకపోతే ఆ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు పనిచేయవు

16లోగా వాడకపోతే ఆ డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు పనిచేయవు

న్యూఢిల్లీ:  వినియోగదారులు నగదు రహిత, ఆన్‌లైన్‌ లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వినియోగం గణనీయంగా  తగ్గిపోయింది. కొంతమందికి కార్డులు ఉన్నా వాటిని వినియోగించట్లేదు. డెబిట్‌ కార్డులు లేదా క్రెడిట్‌ కార్డులు కలిగి ఉన్న కస్టమర్లు ప్రయోజనాల దృష్ట్యా  మోసపూరితమైన లావాదేవీ అడ్డుకట్ట వేసేందుకు మార్పులు చేస్తూనే ఉంటాయి. 

ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం మీ దగ్గరున్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఇప్పటి దాకా వాడకపోయినట్లైతే ఈనెల 16 నుంచి అవి పనిచేయవు.   డెబిట్‌/క్రెడిట్‌ కార్డు లావాదేవీల భద్రత పెంపులో భాగంగా ఈ ఏడాది జనవరి 15న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఓ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి 16లోగా వినియోగించని కార్డులను నిరుపయోగం  చేయాలని బ్యాంకర్లను..కార్డు మంజూరుదారులను ఆర్‌బీఐ ఆదేశించింది.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(RFID) టెక్నాలజీ ఆధారంగా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు పెరిగిపోతుండగా..ఈ సేవల్లో ఎలాంటి మోసాలకు తావులేకుండా వినియోగదారుల కోసం ఆర్‌బీఐ అనేక సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా  వాడని కార్డులు పనిచేయవని  ఆర్‌బీఐ తెలిపింది.


logo