శనివారం 06 జూన్ 2020
National - May 13, 2020 , 02:40:30

36రోజుల్లోనే స్వస్థ్‌వాయు వెంటిలేటర్‌ సృష్టి

36రోజుల్లోనే స్వస్థ్‌వాయు వెంటిలేటర్‌ సృష్టి

బెంగళూరు: కరోనా రోగులకోసం నేషనల్‌ ఏరోస్పేస్‌ లాబొరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) సంస్థ వెంటిలేటర్‌ను తయారు చేసింది. స్వస్థ్‌వాయు పేరుతో పిలుస్తున్న ఈ వెంటిలేటర్‌ను కేవలం 36 రోజుల్లోనే తయారుచేసినట్లు సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఏఎల్‌ డైరెక్టర్‌ జితేంద్ర జే జాదవ్‌ మంగళవారం తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎన్‌ఏఎల్‌ సాంకేతిక, వైద్య నిపుణులు దీన్ని తయారుచేశారని, అనుమతి రాగానే ప్రైవేటు సంస్థలతో కలిసి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు.


logo