మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 11:51:20

ఇది క‌దా సాహసం అంటే.. నది ప్రవాహంలో దూసుకెళ్తున్న డ్రైవ‌ర్‌!

ఇది క‌దా సాహసం అంటే..  నది ప్రవాహంలో దూసుకెళ్తున్న డ్రైవ‌ర్‌!

చాలామంది సాహ‌సాలు చేస్తుంటారు. దానికోసం వారి ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌రు. అంతేకాదు వీరికి ప్రాణంపై తీపి కూడా ఉండ‌దు. అయితే వీరంతా పేరు కోసం ఈ విధంగా చేస్తే ఇత‌ను మాత్రం ఉపాధి కోసం న‌దిలో ట్ర‌క్కు న‌డిపాడు. వాహ‌నానికి స‌గం వ‌ర‌కు నీళ్లు వ‌చ్చాయి. చూస్తుంటే న‌ది ప్ర‌వాహంలానే ఉంది. ఇంత‌లోతు నీరు వ‌స్తుండేస‌రికి అటువైపు ఎవ‌రూ వాహ‌నాలు కూడా న‌డ‌ప‌డం లేదు.

ఇత‌ను మాత్రం న‌ది ప్ర‌వాహానికి  ఎదురెళ్తూ ట్ర‌క్ న‌డుపుతున్నాడు. స‌రైన టైంకు లోడ్ దించ‌డానికి పొంచి ఉన్న ఆప‌ద‌ను కూడా లెక్క‌చేయ‌లేదు. అత‌ని సాహ‌సాన్ని చూసి బోటులో వెళ్తున్న కొంద‌రు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియో చూస్తున్నంత‌సేపు అత‌నికి స‌లాం కొట్టాల‌నిపిస్తుంది. అత‌ని ధైర్య సాహ‌సాల‌కు అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా వీడియో చూసేయండి.  logo