బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 08:18:03

గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడిగా సీఆర్‌ పాటిల్‌

గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడిగా సీఆర్‌ పాటిల్‌

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎంపీ సీఆర్‌ పాటిల్‌ను గుజరాత్‌ బీజేపీ విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఆ పార్టీ అధిష్ఠానం ఒక ప్రకటనలో వెల్లడించింది. గుజరాత్‌లోని నవ్‌సరి లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న పాటిల్‌.. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ప్రధాని మన్ననలు పొందారు. మరోవైపు, లఢక్‌ కేంద్రపాలిత ప్రాంతం బీజేపీ అధ్యక్షుడిగా జమ్యాంగ్‌ త్సెరింగ్‌ నమ్‌గ్యాల్‌ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 


logo