గురువారం 16 జూలై 2020
National - Jun 15, 2020 , 18:32:30

జూన్‌ 16న దేశవ్యాప్త నిరసనకు కార్యచరణ : సీపీఎం

జూన్‌ 16న దేశవ్యాప్త నిరసనకు కార్యచరణ : సీపీఎం

ఆంధ్రప్రదేశ్‌ : పెట్రోల్‌ ధరలు పెంపు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూన్‌ 16న సీపీఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడు బాబురావు సోమవారం తెలిపారు. కరోనా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్‌లో రోజురోజుకూ పెట్రోల్‌ ధర తగ్గుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం ఇతర పన్నులు విధించి ధరలను అత్యధికంగా పెంచిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో పెట్రోల్‌పై రూ10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్‌ పన్ను విధించిందని, దీంతో రూ.2లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది కేంద్రం ప్రకటించిన కరోనా ప్రత్యేక ప్యాకెజీ కంటే ఎక్కువని తెలిపారు. ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంలో సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే కేంద్ర ప్రభుత్వం మానవత్వ లేకుండా వారికి భారమయ్యే నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు.


logo