శనివారం 06 జూన్ 2020
National - May 18, 2020 , 16:49:24

వలస కార్మికులకు సీపీ మహేశ్ భగవత్ అన్నదానం

వలస కార్మికులకు సీపీ మహేశ్ భగవత్ అన్నదానం

యాదాద్రి భువనగిరి: కాలినడకన వెళ్తున్న 20 మంది వలస కార్మికులకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నదానం చేశారు. లాక్ డౌన్ తో రాష్ట్రంలో చిక్కుకున్న వలసకార్మికులు సొంతూళ్లకు వెళ్లేందుకు హరేకృష్ణ ఫౌండేషన్  తో సీపీ మహేశ్ భగవత్ బస్సు ఏర్పాటు చేయించారు. చౌటుప్పల్ మీదుగా ఛత్తీస్ గఢ్ కు వెళ్తున్న కార్మికులకు మార్గమధ్యలో సీపీ మహేశ్ భగవత్ నిత్యవసర సరుకులు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు అర్థాకలితో అలమటించకుండా రేషన్, ఇతర సరుకులు అందజేసిన విషయం తెలిసిందే. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo