న్యూఢిల్లీ : కరోనా టీకా రిజిస్ర్టేషన్ల కోసం ఏర్పాటు చేసిన కొవిన్ సైట్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. రిజిస్ర్టేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే కొవిన్ సైట్, ఆరోగ్యసేతు యాప్‌ల సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఓటీపీలు ఆలస్యంగా వస్తున్నాయని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో సర్వర్లు క్రాష్ అయి రిజిస్ర్టేషన్ల ప్రక్రియకు అంతరాయం కలిగింది.
18 ఏండ్లు పైబడిన వారికి టీకాల కోసం ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ర్టేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. కొవిన్, ఆరోగ్యసేతు, ఉమాంగ్ యాప్‌లలో రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయి. మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి టీకా ఇవ్వనున్నారు.
ఇవికూడా చదవండి..