మార్చి నాటికి మార్కెట్లోకి కొవిషీల్డ్ వ్యాక్సిన్

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుందని పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తెలిపింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం టీకాను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ‘కొవిషీల్డ్’ పేరుతో అభివృద్ధి చేసి, పరీక్షిస్తోంది. ప్రస్తుతం సంస్థ 1600 మంది వలంటీర్లపై రెండు, మూడో విడత ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సిన్ టూర్లో భాగంగా సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు. అనంతరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం అపెక్స్ డ్రగ్ రెగ్యులరేటర్‌కు రెండువారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు.
యూకే, బ్రెజిల్ నుంచి వచ్చిన చివరి దశ వ్యాక్సిన్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను ఆస్ట్రాజెనెకా విశ్లేషించింది. వ్యాక్సిన్ రెండు వేర్వేరు మోతాదుల్లో 70.4శాతం ప్రభావంతంగా ఉందని చెప్పింది. సీరం ఇనిస్టిట్యూట్ తయారీ, నిల్వ చేసే లైసెన్స్ కింద 40 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేసిందని కంపెనీ తెలిపింది. మరో 60-70 మిలియన్ మోతాదులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వంద మిలియన్ డోసులు, జూన్-జూలై నాటికి 400 మిలియన్ మోతాదులను చేరుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ అంతరాయానికి పాక్ ట్విట్టర్ ఖాతాల కుట్ర!
- 100 మంది మెరిట్ విద్యార్థులకు పరేడ్ చాన్స్!
- కంగన సంచలనం: ఆ డ్రెస్ కొనేందుకు డబ్బుల్లేవంట!
- లాలూ త్వరగా కోలుకోవాలి: నితీశ్ ఆకాంక్ష
- కార్గిల్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రారంభం
- రూబీ గోల్డ్ యజమాని ఇఫ్సర్ రెహమాన్ అరెస్టు
- ఢిల్లీ వరకు రివర్స్‌లో ట్రాక్టర్ నడిపిన రైతు
- సుంకాలు మోయలేం.. జీఎస్టీ తగ్గించండి: ఫోన్ ఇండస్ట్రీ వేడికోళ్లు
- రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
- కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపిన తల్లి