మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 16:56:02

కోవిడ్ టీకా ఫ్రీగా ఇస్తాం : త‌మిళ‌నాడు సీఎం

కోవిడ్ టీకా ఫ్రీగా ఇస్తాం : త‌మిళ‌నాడు సీఎం

హైద‌రాబాద్‌: కోవిడ్ టీకా వ‌చ్చిన త‌ర్వాత దాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లుకు ఉచితం ఇవ్వ‌నున్న‌ట్లు త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి తెలిపారు.  ఈ విష‌యాన్ని ఆయ‌న ఇవాళ ప్ర‌క‌టించారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ఇవాళ మ్యానిఫెస్టో రిలీజ్ చేసిన బీజేపీ.. ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉచితం టీకా ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పింది. టీకా ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన కొన్ని గంట‌ల్లోనే త‌మిళ‌నాడు సీఎం కూడా ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఏడాది ఆరంభంలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్న విష‌యం తెలిసిందే.