బుధవారం 08 జూలై 2020
National - Jun 27, 2020 , 11:18:59

కోవిడ్‌19.. పెరుగుతున్న దాడులు, ఆత్మ‌హ‌త్య‌లు

కోవిడ్‌19.. పెరుగుతున్న దాడులు, ఆత్మ‌హ‌త్య‌లు

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌19 కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దాడులు ఎక్కువైన‌ట్లు మాన‌సిక నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.  దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్న‌ట్లు తెలిపారు. వైర‌స్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన వారు తీవ్ర ఆందోళ‌న‌ల‌కు లోన‌వుతున్నారు.  పాజిటివ్ వ్య‌క్తులు డిప్రెష‌న‌ల్‌కు గుర‌వుతున్న‌ట్లు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  కొన్ని సంద‌ర్భాల్లో ఆత్మ‌హ‌త్య‌లు కూడా చోటుచేసుకుంటున్న‌ట్లు వారు వెల్ల‌డించారు. 

శ‌రీరం బ‌ల‌హీనంగా మార‌డం,  వ్యాధి సంక్ర‌మిస్తుంద‌న్న భ‌యం,  ఆందోళ‌న‌క‌ర దాడులు,  విభిన్న‌మైన ప్ర‌వ‌ర్త‌న‌, నిద్ర‌లేమి, తీవ్ర ఆందోళ‌న‌లు, నిస్స‌హాయంగా ఫీల‌వ‌డం లాంటి ల‌క్ష‌ణాల‌తో జ‌నం స‌త‌మ‌తం అవుతున్న‌ట్లు మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ నెమ్మ‌దించ‌డం వ‌ల్ల కూడా డిప్రెష‌న్‌, చికాగు లాంటి ఇబ్బందులు ఎదుర‌వుతున్న‌ట్లు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

ఉద్యోగాలు కోల్పోవ‌డం, ఆర్థిక ఇబ్బందులు,  భ‌విష్య‌త్తుపై అనిశ్చితి, ఆహార నిల్వ‌లు త‌గ్గిపోవ‌డం వంటి సంఘ‌ట‌న‌ల వ‌ల్ల కూడా ప్ర‌జ‌లు మాన‌సిక ఆందోళ‌న‌ల‌కు గురి అవుతున్న‌ట్లు నిపుణులు పేర్కొంటున్నారు.logo