సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 18:33:49

కవల బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌

కవల బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా పాజిటివ్ మ‌హిళ‌

ముంబై: క‌రోనా సోకిన ఒక మ‌హిళ శుక్ర‌వారం క‌వ‌ల బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌హారాష్ట్ర‌లోని పూణేలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ‌ర్భ‌ణీ అయిన 29 ఏండ్ల మ‌హిళ‌కు ఇటీవ‌ల క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా వ‌చ్చింది. దీంతో పూణే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సోనావనే ద‌వాఖాన‌లోని ఐసొలేష‌న్ వార్డులో ఆమెను ఉంచారు. కాగా, ఆ మ‌హిళ శుక్ర‌వారం ఇద్ద‌రు ఆడ శిశువుల‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌ల్లీ బిడ్డ‌లు ఆరోగ్యంగానే ఉన్నార‌ని అక్క‌డి వైద్యులు తెలిపారు. అయితే పుట్టిన ఆడ శిశువుల‌కు క‌రోనా సోకిందా లేదా అన్న‌ది ఇంకా నిర్ధార‌ణ కాలేద‌ని చెప్పారు. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య నాలుగు ల‌క్ష‌లు దాట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 14,463 మంది మ‌ర‌ణించారు.logo