గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 17:49:07

వ‌ల‌స కూలీల‌ను ఆపిన పోలీసులు: తోపులాట‌

వ‌ల‌స కూలీల‌ను ఆపిన పోలీసులు:  తోపులాట‌

మ‌ధుర‌: మ‌ధుర స‌రిహ‌ద్దు వ‌ద్ద స్వ‌రాష్ట్రాల‌కు వెళుతున్న‌ వ‌ల‌స కార్మికులు, యూపీ రాజ‌స్థాన్ పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు.  వివ‌రాల్లోకి వెళితే రాజ‌స్థాన్ పోలీసుల స‌హాయంతో వ‌ల‌స కూలీసులు సంబంధిత అధికారుల వ‌ద్ద‌ రిజిస్ట్రేష‌న్ చేసుకోకుండా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఇద్దరు యూపీ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు, న‌లుగురు పోలీసులు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని మ‌ధురై ఏఎస్పీ గౌర‌వ్ గ్రోవ‌ర్ వివ‌రించారు.

గ‌త కొద్దిరోజులుగా కొన్ని ప్రైవేట్ బ‌స్సుల్లో రాజ‌స్థాన్ స‌రిహ‌ద్దులో వ‌ల‌స కూలీల‌సు వ‌దులుతున్నారు. ఈ రోజు వారంతా రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించారు. రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్ జిల్లాలో ఉద్యోగ్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు చెందిన పోలీసులు వారికి స‌హాయ‌ప‌డ్డార‌ని తెలిసింది. ఈ విష‌యంపై భ‌ర‌త్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. ప‌రిస్థితి ప్ర‌స్తుతం అదుపులోనే ఉంద‌ని, రాజ‌స్థాన్ నుంచి అధికారికంగా పేర్లు న‌మోదు చేసుకున్న వారిని మాత్ర‌మే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోకి అనుమ‌తిస్తామ‌న్నారు. 


logo