శనివారం 28 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 20:45:49

మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

మహారాష్ట్రలో 44 వేలు దాటిన కరోనా మరణాలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 44 వేలు దాటింది. అయితే వైరస్‌ వ్యాప్తి గతం కంటే కాస్త తగ్గింది. వారం రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 5,369 పాజిటివ్‌ కేసులు,  113 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,83,775కు, మరణాల సంఖ్య 44,024కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 3,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,14,079కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,25,109 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.