గురువారం 29 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 19:06:07

తమిళనాడులో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

తమిళనాడులో ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటింది. ప్రతి రోజు ఐదు వేలకు‌పైగా కరోనా కేసులు, 50కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,688 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 66 మంది కరోనా రోగులు మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,03,290కు, మరణాల సంఖ్య 9,586కు చేరింది. గత 24 గంటల్లో 5,516 మంది కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తమిళనాడులో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,47,335కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 46,369 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo