గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 12:04:42

లాక్‌డౌన్ వ‌ద్ద‌నుకుంటే.. నియ‌మాలు పాటించండి : క‌ర్నాట‌క సీఎం

లాక్‌డౌన్ వ‌ద్ద‌నుకుంటే.. నియ‌మాలు పాటించండి : క‌ర్నాట‌క సీఎం

హైద‌రాబాద్‌: బెంగుళూరులో మ‌ళ్లీ కోవిడ్‌19 కేసులు పెరుగుతున్నాయ‌ని క‌ర్నాట‌క సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు.  ఈ నేప‌థ్యంలో బెంగుళూరులోని కొన్ని ప్రాంతాల‌ను సీజ్ చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  మంత్రులు, అధికారుల‌తో ఇవాళ రాష్ట్ర ప‌రిస్థితిపై  మ‌రోసారి చ‌ర్చ‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. బెంగుళూరులో కోవిడ్ రోగుల‌కు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు సీఎం చెప్పారు.  

బెంగుళూరులో పెరుగుతున్న కోవిడ్ కేసుల గురించి కూడా ఆలోచిస్తున్న‌ట్లు సీఎం య‌డ్డీ తెలిపారు.  సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను కోరారు. శానిటైజేష‌న్ కూడా చేయాల‌న్నారు. ఒక‌వేళ  మ‌రోసారి లాక్‌డౌన్ వ‌ద్ద‌నుకుంటే.. ఈ నియ‌మాల‌ను క‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంద‌ని సీఎం య‌డ్డీ తెలిపారు. 


logo