మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 16:34:58

ఇంట్లో నిఖా వేడుక.. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వధువు సంబురాలు!

ఇంట్లో నిఖా వేడుక.. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వధువు సంబురాలు!

తిరువనంతపురం: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల చాలామంది వివాహాలు, ఇతర శుభకార్యాలను వాయిదావేసుకున్నారు. తప్పనిసరి చేసుకోవాల్సి ఫంక్షన్లను అతికొద్ది మంది సమక్షంలో జరుపుకున్నారు. ఇంకొంతమంది టెక్నాలజీని వాడుకొని వీడియోకాల్స్‌ ద్వారా పలు శుభకార్యాలను జరిపించారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. ఇప్పుడిప్పుడు కొన్ని వాయిదాపడ్డ శుభకార్యాలను నిర్వహిస్తున్నారు. అయితే, కేరళలో ఓ జంటకు వివాహం నిశ్చయమైంది. ఇంతలోనే వధువుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయినా కుటుంబ సభ్యులు నిఖా వేడుకను జరిపించారు.

కరోనా పాజిటివ్‌గా తేలిన వధువును ఎర్నాకుళంలోని మట్టంచెరిలోగల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచారు. వారి సాంప్రదాయం ప్రకారం నిఖా వేడుకవద్ద వధువు ఉండాల్సిన అవసరం లేదు. దీంతో కుటుంబ పెద్దలు ఈ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోని సహరోగులు ఆమెను సంతోషపరచాలని నిర్ణయించుకున్నారు. ఆమె చుట్టూ చేరి పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo