శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 17, 2021 , 07:04:49

మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్‌ టీకా పంపిణీ

మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్‌ టీకా పంపిణీ

ముంబై : పలు సాంకేతిక సమస్యలతో మహారాష్ట్రలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. శుక్రవారం దేశవ్యాప్తంగా లాంఛనంగా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే మహారాష్ట్రలో వ్యాక్సిన్‌ మొదలైన కొద్దిసేపటికే నిలిచిపోయింది. కొవిన్‌ యాప్‌లో పలు సాంకేతిక సమస్యలు ఎదురవడంతో ఆ రాష్ట్ర సర్కార్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను నిలిపివేసింది. సమస్య పరిష్కారమైతే ఈ నెల 18వ తేదీ నుంచి మళ్లీ టీకాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ వేసే సమయంలో కొవిన్‌ యాప్‌లో డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇదిలా ఉండగా ముంబైలో శనివారం 1,926 మందికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చారు. తొలిరోజు 4,100 మందికి టీకా వేయాలనేది లక్ష్యం. ఇందుకోసం ముంబైలో పది కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

VIDEOS

logo