National
- Jan 20, 2021 , 12:26:08
VIDEOS
లక్షద్వీప్‌లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం

న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సోమవారం నాడు కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఓ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో కేంద్రం అప్రమత్తమై ప్రత్యేక బృందాన్ని లక్షద్వీప్‌కు పంపింది. అయితే కొచ్చి నుంచి జనవరి 4వ తేదీన ఓ ప్రయాణికుడు నౌకలో లక్షద్వీప్ వెళ్లాడు. అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్టులు నిర్వహించారు. ఆ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతనితో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు నిర్వహించారు. 31 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, 14 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 14 మందితో కలిసి తిరిగిన మరో 56 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు.
తాజావార్తలు
- ప్రగ్యా ఠాకూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య
- లవర్‌తో హోటల్లో గడిపేందుకు బాలికను కిడ్నాప్ చేసిన మహిళ
- విడాకులు వద్దు.. నా భర్తే ముద్దంటున్న నవాజుద్ధీన్ భార్య
- ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 !
- తృణమూల్‌కు గుడ్‌బై చెప్పిన మరో నేత
- రెండో డోస్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి
- మహేష్‌ను కాపీ కొట్టేసిన శర్వానంద్
- వారికి మిత్తితో సహా బదులిస్తాం : మంత్రి కేటీఆర్
- మహేష్ బాబును కాపీ కొట్టేసిన బర్త్ డే బాయ్ ..!
MOST READ
TRENDING