గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 13:48:18

ఆ ఆరు రాష్ట్రాల్లో 61శాతం కొవిడ్‌ రికవరీ రేటు : కేంద్రం

ఆ ఆరు రాష్ట్రాల్లో 61శాతం కొవిడ్‌ రికవరీ రేటు : కేంద్రం

న్యూఢిల్లీ : దేశంలో అత్యధిక కేసులు ఉన్న ఆరు రాష్ట్రాల్లో రికవరీ రేటు 61శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 70,16,046 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. జాతీయ రికవరీ రేటు శనివారం 89.78శాతానికి చేరింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీలో 61శాతానికి రికవరీలు పెరిగాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశం రికవరీల్లో మహారాష్ట్రలో 20.6శాతం, ఏపీలో 10.9శాతం, కర్ణాటక 9.9, తమిళనాడులో 9.4, యూపీలో 6.1శాతం, ఢిల్లీలో 4.1శాతం నమోదైంది. ఇటీవల రికవరీ కేసులు తాజాగా కేసులను మించిపోయాయని కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 67,549 మంది మహమ్మారి నుంచి బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

గడిచిన 24 గంటల్లో 67,549 కోవిడ్ -19 రోగులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,370 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 80శాతం పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదు కాగా, కేరళ గరిష్టంగా 8వేలు, తర్వాత మహారాష్ట్రలో 7వేలు పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయని కేంద్రం పేర్కొంది. దేశంలో తాజాగా 53,370 కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 78.14లక్షలకు చేరింది. తాజాగా 650 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటికీ 1,17,956 మంది చనిపోయినట్లు కేంద్రం చెప్పింది. కొవిడ్‌ మరణాల రేటు 1.51శాతానికి తగ్గిందని, ప్రస్తుతం 6,80,680 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.