బుధవారం 03 జూన్ 2020
National - May 12, 2020 , 18:07:31

కరోనా వచ్చినా.. కర్తవ్యం మరువను

కరోనా వచ్చినా.. కర్తవ్యం మరువను

లడక్‌: ఆయనో గణితం  ఉపాధ్యాయుడు. కరోనా వైరస్‌ సోకి దవాఖాన ఐసొలేషన్‌ వార్డులో చికిత్స తీసుకొంటున్నాడు. అయినప్పటికీ ఏ మాత్రం కుంగిపోకుండా తన కర్తవ్యాన్ని కొనసాగిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఆయనే జమ్ముకశ్మీర్‌కు చెందిన గణితం మాస్టారు కైఫియత్‌ హుస్సేన్‌. కరోనా కారణంగా లేహ్‌లోని మహాబోధి దవాఖానలో ఐసోలేషన్‌ వార్డుకు పరిమితమై కుంగిపోకుండా తన పాండిత్యాన్ని పది మందికి పంచుకొంటే బాగుంటుందని చెప్పి.. ఆన్‌లైన్‌ వీడియో పాఠాలు చెప్పడం  ప్రారంభించాడు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే మ్యాథ్స్‌ ఫార్ములాలు, అల్జిబ్రా లెక్కలను బోధిస్తున్నాడు. ఐసొలేషన్‌ వార్డులోకి వచ్చిన తర్వాత రెండు రోజులు మానసికంగా కృంగిపోయానని, దాన్ని అధిగమించేందుకు పాఠాలు చెప్పడం ఒక్కటే మందు అని భావించి గణితం పాఠాలు చెప్తున్నానంటున్నారు కైఫియత్‌ హుస్సేన్‌. నిత్యం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆన్‌లైన్‌ తరగతులు తీసుకొంటూ ఉత్సాహంగా ఉండేలా చూసుకొంటున్నా అని వెల్లడిస్తున్నారాయన.


logo