గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:12:48

మార్కెట్‌లోకి కరోనా మందు.. రూ.59కే అందుబాటులోకి

మార్కెట్‌లోకి కరోనా మందు.. రూ.59కే అందుబాటులోకి

హైదరాబాద్‌ : హెటిరో ల్యాబ్స్ ఫావిపిరావిర్ పేరుతో భారతదేశంలో జెనరిక్ మందును మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. హెటిరో ఫావిపిరావి‌ర్‌కు డీసీఐజీ నుంచి తయారీ, మార్కెటింగ్‌కు అనుమతి కూడా లభించింది. కరోనా చికిత్సలో ఉపయోగించిన కోవిఫోర్ తర్వాత హెటెరో అభివృద్ధి చేసిన రెండో ఔషధం ఫావిపిరావిర్‌. ఇది నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ మందు. దేశవ్యాప్తంగా ఈ ఔషధం మందుల దుకాణాలు, పార్మసీల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలియజేసింది. అయితే దీన్ని వైద్యుల సూచన మేరకే రోగులకు ఇవ్వనున్నారు. 

ఫావిపిరావిర్‌ కరోనా చికిత్సలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. అయితే దీన్ని వ్యాధి ప్రాథమిక, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు వాడాల్సి ఉంటుంది. ఫావిపిరావిర్‌ ఔషధాన్ని ఒక టాబ్లెట్‌కు రూ.59గా ధర నిర్ణయించారు. ఈ ఔషధాన్ని భారతదేశంలోని సంస్థకు చెందిన ప్రపంచ స్థాయి సూత్రీకరణ కేంద్రంలో తయారు చేస్తున్నారు. దీనికి యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారులు ఆమోదం తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo