సోమవారం 06 జూలై 2020
National - May 29, 2020 , 12:45:22

జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు.. కరోనా బాధితుల ఆవేదన

జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు.. కరోనా బాధితుల ఆవేదన

లక్నో : తమను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి ఆహారం, నీరు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. కొవిడ్‌-19 వార్డులో ఉన్న రోగులను ఆస్పత్రి సిబ్బంది చులకనగా చూస్తున్నారని బాధిత వ్యక్తులు తెలిపారు.

సమయానికి తిండి పెట్టడం లేదని, కనీసం తాగేందుకు కూడా నీరు ఇవ్వడం లేదన్నారు. తమను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన చెందారు. సరిగ్గా ఉడకని అన్నం పెట్టి కడుపు మాడుస్తున్నారని కరోనా బాధితులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది వద్ద ఒకవేళ డబ్బు లేకపోతే తమ వద్ద తీసుకోని మెరుగైన సౌకర్యాలు కల్పించండి.. ఇవే పరిస్థితులు కొనసాగితే ఇంటికెళ్తామని ఓ బాధితురాలు చెప్పింది. 

ఈ ఘటనపై ప్రయాగరాజ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ స్పందించారు. కరెంట్‌ సమస్య వల్ల నీటి సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు. విద్యుత్‌ మరమ్మతులు చేపట్టి.. రెండు గంటల్లోనే రోగులకు మంచినీరు అందించామని ఆయన తెలిపారు. 


logo