శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 14:36:02

క‌రోనా టైంలో కూడా మొబైల్ సేల్స్‌.. భ‌లే ఐడియా!

క‌రోనా టైంలో కూడా మొబైల్ సేల్స్‌.. భ‌లే ఐడియా!

క‌రోనా నేప‌థ్యంలో మొబైల్స్, ఎల‌క్ట్రానిక్ యాక్స‌స‌రీస్ ఏవి కావాల‌న్నా బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఇంటి నుంచే ఆన్‌లైన్లో బుక్ చేసుకుంటున్నారు. దీంతో మొబైల్ షాపుల‌న్నీ దివాలా తీసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీన్నే ఉపాధిగా మార్చుకున్న య‌జ‌మానులంద‌రూ మ‌రో వ్యాపారం చేసుకోలేక బాధ‌ప‌డుతున్నారు. అందుక‌ని కొచ్చికు చెందిన ఓ షాపు య‌జ‌మాని శ్యామ్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు.

త‌న మొబైల్ షాపును మూసేసి కారునే షాపుగా మార్చుకున్నాడు. అంటే ఆటోమొబైల్ అన్న‌మాట‌. ఫోన్‌కి ఏ చిన్న రిపేర్ వ‌చ్చినా త‌క్ష‌ణ‌మే స‌రిదిద్దేలా అందుబాటులోకి తీసుకువ‌చ్చాడు. మొబైల్ రీఛార్జిలు, ఇత‌ర అవ‌స‌రాల కోసం ఇత‌ని వ‌ద్ద‌కు బాగానే క‌స్ట‌మ‌ర్లు వ‌స్తున్నారు. అతను అందిస్తున్న నిరంతరాయమైన సేవతో అతని క్లయింట్లు సంతృప్తి చెందారు.

తాజావార్తలు


logo