ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 17, 2020 , 10:13:45

4 నెల‌ల త‌ర్వాత‌.. 30 వేల లోపే కోవిడ్ కేసులు

4 నెల‌ల త‌ర్వాత‌.. 30 వేల లోపే కోవిడ్ కేసులు

హైద‌రాబాద్‌:  దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 29,164 కోవిడ్ కేసులు న‌మోదు అయ్యాయి. అయితే గ‌త నాలుగు నెల‌ల్లో 30 వేల లోపు క‌న్నా.. త‌క్కువ కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి.  దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ సోకిన వారి సంఖ్య 88,74,291కి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.  గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల సుమారు 449 మంది చ‌నిపోయారు.  దేశ‌వ్యాప్తంగా వైర‌స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటి వ‌ర‌కు 1,30,519కి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,53,401కి చేరుకున్న‌ది.  గ‌త 24 గంట‌ల్లోనే 12077 మంది కోలుకున్నారు. ఇక డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య 82,90,371గా ఉన్న‌ది. దీంట్లో గ‌త 24 గంట‌ల్లో డిశ్చార్జ్ అయిన వారు 40,791 మంది ఉన్నారు. 

జూలై 15వ తేదీ  త‌ర్వాత దేశంలో తొలిసారి కోవిడ్ కేసుల సంఖ్య రోజువారి లెక్క‌ల్లో 30 వేల క‌న్నా త‌క్కువ న‌మోదు కావ‌డం విశేషం. సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో ఓ ద‌శ‌లో దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 90 వేల‌కు చేరుకున్న‌ది. అయితే అక్టోబ‌ర్ నుంచి దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతున్న‌ది.  దేశంలో రిక‌వ‌రీ రేటు 93.4 శాతానికి చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది.