బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 20:23:05

కరోనా ఎఫెక్ట్‌ : భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 67 మంది అరెస్టు

కరోనా ఎఫెక్ట్‌ : భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన 67 మంది అరెస్టు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో కరోనా నియంత్రణ నియమాలు పాటించని 67 మందిని ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్‌మాస్కులు ధరించని 126 మందిపై, పబ్లిక్‌ ప్రాంతాల్లో ఉమ్మిన 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కోల్‌కతాలో కరోనా విజృంభన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. పబ్లిక్‌ ప్రాంతాల్లో ఉమ్మడం నిషేధించింది.

ఇద్దరు కంటే ఎక్కువ మంది ఓ చోట కనిపిస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆగష్టు 31 వరకు ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగష్టు 5, 8, 16,17, 23, 24వ తేదీల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది.  ఇప్పటివరకు కోల్‌కతాలో 72,777 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 20,631 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 1629 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. 


logo