శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 05, 2021 , 14:56:48

సైకిల్‌పై వ‌చ్చిన కొవిడ్ వ్యాక్సిన్‌!

సైకిల్‌పై వ‌చ్చిన కొవిడ్ వ్యాక్సిన్‌!

వార‌ణాసి: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ డ్రైర‌న్‌లో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన యూపీలోని వార‌ణాసిలో ఓ వింత ఘ‌ట‌న జ‌రిగింది. క‌రోనా వ్యాక్సిన్‌ను ఓ ఆసుప‌త్రికి సైకిల్‌పై తీసుకురావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వార‌ణాసి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చౌకాఘాట్‌లో ఉన్న వుమెన్స్ హాస్పిట‌ల్‌కు ఓ ఉద్యోగి కొవిడ్ వ్యాక్సిన్‌పై సైకిల్‌పై తీసుకొచ్చాడు. ఈ ఘ‌ట‌న ఇప్పుడు అక్క‌డి అధికారుల వ్యాక్సిన్ పంపిణీ సంసిద్ధ‌త‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది. ఇదే విష‌య‌మై వార‌ణాసి చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ను వీబీ సింగ్‌ను ప్ర‌శ్నించ‌గా.. ఐదు సెంట‌ర్ల‌కు ఓ వ్యాన్ సాయంతో వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేశామ‌ని, ఒక్క వుమెన్స్ హాస్పిట‌ల్‌కు మాత్ర‌మే ఇలా సైకిల్‌పై వ‌చ్చింద‌ని చెప్పారు. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన క‌రోనా వ్యాక్సిన్ డ్రైర‌న్‌లో భాగంగా యూపీలోని వార‌ణాసి జిల్లాలో కూడా ప‌లు ప్రాంతాల్లో డ్రైర‌న్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మాక్ డ్రిల్ నిర్వ‌హించారు.