ఆదివారం 07 మార్చి 2021
National - Jan 16, 2021 , 20:54:23

116కు చేరిన బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా కేసులు

116కు చేరిన బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా కేసుల సంఖ్య 116కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా రెండు కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో శుక్రవారం 114గా ఉన్న బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా కేసుల సంఖ్య శనివారం నాటికి 116కు చేరినట్లు వెల్లడించింది. ఈ కొత్త రకం కరోనా వైరస్‌ సోకిన వారిని ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు తెలిపింది. బ్రిటన్‌ వేరియంట్‌ కరోనా వ్యాపించిన వ్యక్తులను కలిసిన వారిని, కుటుంబ సభ్యులను గుర్తిస్తున్నట్లు పేర్కొంది. 

మరోవైపు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.05 కోట్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి 1.5 లక్షల మందికిపైగా మరణించినట్లు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తున్నది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Previous Article రాశి ఫలాలు
Next Article వాస్తు
VIDEOS

logo