ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 20:14:32

కరోనా పరీక్షల నిర్వహణను మరింత పెంచాలి : సీఎం యోగి

కరోనా పరీక్షల నిర్వహణను మరింత పెంచాలి : సీఎం యోగి

లక్నో :  రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణను మరింత పెంచాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులకు సూచించారు.  సోమవారం టీమ్‌-11 బృందంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 లక్షల జనాభా ఉన్న జిల్లాల్లో రోజుకు వెయ్యి యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని, 25 లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లాల్లో 1,500కు పైగా పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలోని దవాఖానలో రాపిడ్ యాంటిజెన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ట్రూనాట్ యంత్రం ద్వారా నిత్యం 2,500 కి పైగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఎల్ -1 కరోనా దవాఖానల్లో 50శాతం పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉండాలని, ఎల్ -2 దవాఖానల్లోఅన్ని పడకలకు ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి. ఎల్-3 దవాఖానల్లో ప్రతి పడకకు ఆక్సిజన్‌తోపాటు వెంటిలేటర్ ఉండాలని చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సీసీకెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా దవాఖనల్లో పడకల సంఖ్య పెంచేందుకు ఓఇన్‌ఛార్జి అధికారిని  నియమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తారని అన్నారు.


logo