శనివారం 04 జూలై 2020
National - Jun 18, 2020 , 16:43:58

ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్ష ధర రూ.2400

ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్ష ధర రూ.2400

ఢిల్లీ : ఢిల్లీలో కరోనా నిర్ధారణ పరీక్ష (కొవిడ్‌-19 ఆర్టీ-పీసీఆర్‌) ధరను అన్నిపన్నులతో కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2400గా నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ట్విట్టర్లో తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దిశానిర్దేశం మేరకు సాధారణ ప్రజలు ఉపశమనం పొందేలా ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ బృందం కరోనా నిర్ధారణ పరీక్ష ధరను గురువారం నిర్ణయించి కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖకు పంపింది. ఆ శాఖ అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికి పంపి తక్షణం అమలు చేయాలని సూచించినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. logo