గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 15:14:06

పూణెలో 50వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

పూణెలో 50వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

పూణె : మహారాష్ట్ర పూణె జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. రోజు రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదువుతుండడం స్థానికంగా ఆందోళన నెలకొంది. సోమవారం తాజాగా 473 కేసులు నమోదు కాగా, కేసుల సంఖ్య 50వేల మార్కును దాటిందని ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. జిల్లాలో మొత్తం 51,885 కొవిడ్‌-19 కేసులు ఉండగా, వైరస్‌తో 1343 మంది మరణించారని అధికారి పేర్కొన్నారు. ఇందులో 37వేల కేసులు పూణె నగరంలోనే నిర్ధారణ అయ్యాయి.  ఆదివారం ఒకే రోజు 1,508 కేసులు నిర్ధారణ కాగా, నగరంలో 37వేల మార్క్‌ దాటిందని ఆరోగ్యశాఖ అధికారి వివరించారు.  వైరస్‌ నుంచి 37,386 మంది కోలుకోగా, 13,799 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 41 మంది మరణించగా, మృతుల సంఖ్య 976 మంది చేరిందని చెప్పారు. అలాగే మరో 730 మంది మధ్యాహ్నం దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. కొవిడ్‌-19 నేపథ్యంలో 23వ తేదీ వరకు పూణెలో లాక్‌డౌన్‌ విధించారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo