శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 20:37:51

అస్సాంలో కరోనా తీవ్రంగా ఉంది : ఆరోగ్యశాఖమంత్రి

అస్సాంలో కరోనా తీవ్రంగా ఉంది : ఆరోగ్యశాఖమంత్రి

టిన్సుకియా : అస్సాం రాష్ట్రంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వాశర్మ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. ‘రాష్ట్రంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది. కానీ చెయ్యిదాటి పోలేదు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే తాత్కాలిక కరోనా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని ఆయన చెప్పారు.

అనంతరం టిన్సుకియా ప్రజా ఆసుపత్రిలో జిల్లా అధికారులు, ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇదిలాఉండగా అస్సాంలో ఇప్పటివరకు 22,918 కరోనా కేసులు నమోదయ్యాయి. 15,165 మంది చికిత్సకు కోలుకొని ఇండ్లకు వెళ్లగా 7,700 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 53మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిసింది.


logo