e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 20 నాటికి గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు

సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 20 నాటికి గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు

సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 20 నాటికి గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్ సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న విష‌యం తెలిసిందే. ఏప్రిల్ నెల మ‌ధ్య వ‌ర‌కు క‌రోనా పాజిటివ్‌ కేసులు తారా స్థాయికి చేరుకుంటాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేశారు. అయితే మే నెల చివ‌ర వ‌ర‌కు సంక్ర‌మ‌ణ కేసులు త‌గ్గే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. సూత్ర అనే గ‌ణిత విశ్లేష‌ణ సంస్థ ఈ అంచ‌నా వేసింది.

భార‌త్‌లో వ‌చ్చిన తొలి వేవ్‌పై కూడా సూత్ర గ‌తంలో ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆగ‌స్టులో కేసులు పెరిగి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు హెచ్చు స్థాయికి చేరుకుంటుంద‌ని, ఆ త‌ర్వాత 2021 ఫిబ్ర‌వ‌రిలో మ‌ళ్లీ కేసులు త‌గ్గుతాయ‌ని సూత్ర అంచనా వేసింది. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు చెందిన మ‌హీంద్ర అగ‌ర్వాల్ కేసుల పెరుగుద‌ల‌పై అంచ‌నాలు చేశారు.

ప్ర‌స్తుతం ఉన్న కేసుల సంఖ్య‌ను ప‌రిశీలిస్తే.. మిడ్ ఏప్రిల్ వ‌ర‌కు ఆ సంఖ్య భారీగా పెరుగుతుంద‌న్నారు. ఏప్రిల్ 15 నుంచి 20 నాటికి కేసులు సంఖ్య గ‌రిష్ట స్థాయికి చేరే అవ‌కాశం ఉంద‌న్నారు. అంతే వేగంగా కూడా మే చివ‌రి నాటికి కేసులు త‌గ్గుతాయ‌ని అగ‌ర్వాల్ తెలిపారు. కొత్త ఇన్‌ఫెక్ష‌న్ల డేటా ఆధారంగా కేసుల సంఖ్య‌ను అంచ‌నా వేస్తున్నామ‌ని, తొలుత పంజాబ్‌, ఆ త‌ర్వాత మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు తారా స్థాయికి చేరుకుంటాయ‌ని ఆయ‌న అన్నారు. ఏప్రిల్‌-మే నెల మ‌ధ్య కాలంలో కేసులు గ‌రిష్ట స్థాయిలో ఉంటాయ‌ని అశోకా వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త గౌత‌మ్ మీన‌న్ తెలిపారు.

ఇవి కూడా చదవండి..

24 గంటల్లో 81,466 కేసులు.. 469 మరణాలు

పూణేలో రేపటి నుంచి 12 గంటలు రాత్రి కర్ఫ్యూ

కరోనా ఎఫెక్ట్‌: ఆ జిల్లాలో పూర్తిస్థాయి లాక్‌డౌన్

మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా.. అధికారి సస్పెండ్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సెకండ్ వేవ్‌.. ఏప్రిల్ 20 నాటికి గ‌రిష్ట స్థాయికి క‌రోనా కేసులు

ట్రెండింగ్‌

Advertisement