శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:33:07

యూపీ జైళ్ల‌ల్లో రాఖీ పండుగ‌పై ఆంక్ష‌లు

యూపీ జైళ్ల‌ల్లో రాఖీ పండుగ‌పై ఆంక్ష‌లు

ల‌క్నో : క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ జైళ్ల‌ల్లో రాఖీ పండుగ‌పై ఆంక్ష‌లు విధించారు. ఆ రోజున జైళ్ల వ‌ద్దకు ఖైదీల తోబుట్టువుల‌ను అనుమ‌తించ‌మ‌ని ఓ అధికారి స్ప‌ష్టం చేశారు. ఒక వేళ తోబుట్టువులు వ‌చ్చిన ఖైదీల‌ను క‌లిసే అవ‌కాశం ఉండ‌ద‌న్నారు. ఖైదీల‌కు రాఖీలు క‌ట్టాల‌నుకునే వారు.. ఆగ‌స్టు 1వ తేదీలోపే జైలు కౌంట‌ర్ల వ‌ద్ద ఇచ్చేయాల‌ని సూచించారు. ఆ రాఖీల‌ను పూర్తిగా శుభ్ర‌ప‌రిచిన త‌ర్వాతే ఖైదీల‌కు ఇస్తామ‌ని తెలిపారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు జైలు అధికారులు స్ప‌ష్టం చేశారు.  

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,951కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 27,934, కాగా 44,520 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 1497కు చేరింది. 


logo