శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 19:43:24

మూడు క్యాటగిరీలుగా కరోనా రెడ్‌ జోన్లు

మూడు క్యాటగిరీలుగా కరోనా రెడ్‌ జోన్లు

కోల్‌కతా: ప్రస్తుతం ఉన్న కరోనా రెడ్‌ జోన్లను మూడు క్యాటగిరీలుగా విభజిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. మంగళవారం  సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కొత్త క్యాటగిరీ జోన్లలో మరిన్ని సడలింపులు ఇస్తామన్నారు. నియంత్రణ లేని ప్రాంతాల్లో 100 రోజుల పని పథకాన్ని పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకొంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 566 కంటైన్మెంట్‌ క్లస్టర్లు ఉండగా.. వీటిలో 326 క్లస్టర్లు కేవలం కోల్‌కతాలో ఉన్నాయి. 

మార్చి 25న లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మమతా విచారం వ్యక్తంచేశారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని తామేమీ భావించడం లేదన్నారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు తమ వద్ద మూడు నెలల స్వల్పకాలిక ప్రణాళిక ఉన్నదని చెప్పారు. ప్రధాని సమావేశం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ఏమీ పొందలేదన్నారు. ఖాళీ చేయిగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు.


logo