గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 01, 2020 , 14:17:04

76.94 శాతానికి కోవిడ్ రిక‌వ‌రీ రేటు

76.94 శాతానికి కోవిడ్ రిక‌వ‌రీ రేటు

హైద‌రాబాద్‌: దేశంలో కోవిడ్‌19 రిక‌వ‌రీ రేటు మ‌రింత పెరిగింది. కోలుకున్న‌వారి సంఖ్య 76.94 శాతానికి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 65081 మంది వైర‌స్ సంక్ర‌మ‌ణ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న‌వారి సంఖ్య 28 ల‌క్ష‌ల 30 వేల 882కు చేరుకున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కోలుకున్న‌వారి సంఖ్య వ‌ల్ల పాజిటివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గుతున్న‌ట్లు అధికారులు అంచ‌నా వేశారు.  పాజిటివ్ కేసుల్లో కేవ‌లం 21.29 శాతం మంది మాత్ర‌మే వైర‌ల్ లోడ్‌తో ఉన్న‌ట్లు చెప్పారు. రిక‌వ‌రీ అవుతున్న వారి సంఖ్య గ‌త కొన్ని వారాల్లో నాలుగు రెట్లు పెరిగిన‌ట్లు ఆరోగ్య శాఖ చెప్పింది.  

ప్ర‌స్తుతం భార‌త్‌లో మ‌ర‌ణాల సంఖ్య 1.77 శాతంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. గ‌త 24 గంట‌ల్లో 69 వేల 921 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36 ల‌క్ష‌ల 91 వేల 166కు చేరుకున్న‌ది. దేశంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 7 ల‌క్ష‌ల 85 వేల 996 ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో 819 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 65 వేల 288కి చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 10 ల‌క్ష‌ల 16 వేల మందికి వైర‌స్ ప‌రీక్ష‌లు చేశారు. మొత్తం టెస్టింగ్ సంఖ్య 4 కోట్ల 33 ల‌క్ష‌లు దాటింది.   logo