శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 17, 2020 , 23:20:49

ప్లాస్మా దానం చేయనున్న మంత్రి

ప్లాస్మా దానం చేయనున్న మంత్రి

ముంబై : కరోనా నుంచి కోలుకున్న మహారాష్ట్ర హౌసింగ్‌ మంత్రి జితేంద్ర అవద్‌ తన ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ముంబ్రా-కల్వా అసెంబ్లీ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అవహాద్, కరోనా వైరస్ బారినపడ్డ ఆయన, ఈ ఏడాది మేలో కోలుకున్నాడు. కరోనా వైరస్‌తో పోరాడిన ఆయన.. ప్రభుత్వ దవాఖానలో ప్లాస్మా దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ట్వీట్ చేశారు. రాబోయే రెండు రోజుల్లో ప్లాస్మాను దానం చేస్తానని అవ‌హద్‌ తెలిపారు. ప్లాస్మా థెరపీ COVID-19 నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మా సేకరించి, బాధితులకు అందించడం ద్వారా బాధితులు త్వరగా కోలుకునేందుకు సహాయపడుతుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo