మంగళవారం 19 జనవరి 2021
National - Dec 24, 2020 , 15:44:16

ఢిల్లీలో ఒక శాతానికన్నా తక్కువగా కరోనా పాజిటివిటి రేటు : సత్యేంద్ర జైన్‌

ఢిల్లీలో ఒక శాతానికన్నా తక్కువగా కరోనా పాజిటివిటి రేటు : సత్యేంద్ర జైన్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం కరోనా పాజిటివి రేటు ఒక శాతానికన్నా తక్కువగా ఉందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ గురువారం తెలిపారు. బుధవారం ఢిల్లీలో 871 పాజిటివిటి  రేటు 0.99శాతంగా ఉందని.. ఒక శాతం కంటే తక్కువని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా రోజుకు వెయ్యి కన్నా తక్కువగా కేసులు వెలుగు చూస్తున్నాయని, సక్రమణ రేటు కొద్ది రోజులుగా రెండు శాతానికంటే తక్కువగా ఉందని వివరించారు. కొవిడ్‌-19 రోగుల కోసం హాస్పిటల్స్‌లో రిజర్వ్‌ చేసిన ఐసీయూ పడకల విడుదలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్‌-19 విధుల్లో పని చేస్తున్న ఎంబీబీఎస్‌ విద్యార్థుల అధ్యయనాలను తిరిగి ప్రారంభించే అంశంపై సమీక్ష సమావేశం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. యూకే నుంచి వస్తూ.. కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయం నుంచి పలువురు ప్రయాణికులు తప్పించుకు వెళ్లినట్లు వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ వారు ఇతర ప్రాంతాలకు వెళ్లరని నమ్ముతున్నానని, ఈ విషయంపై ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీతో మాట్లాడనున్నట్లు సత్యేంద్ర జైన్‌ పేర్కొన్నారు.