ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 18:57:41

ఉత్తరాఖండ్‌లో 67 కరోనా పాజిటివ్‌ కేసులు

ఉత్తరాఖండ్‌లో 67 కరోనా పాజిటివ్‌ కేసులు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మంగళవారం 67 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హల్ద్వానీ కేంద్రంగా పని చేసే సుశీలతివారీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓమహిళ మరణించగా, ఇప్పటి వరకు వైరస్‌తో 25 మంది ప్రాణాలను కోల్పోయారు. మరణించిన మహిళ హల్ద్వానీలోని బేస్ హాస్పిటల్ నుంచి సుశీలతివారీ ప్రభుత్వ దవాఖానకు రిఫర్ చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. మృతురాలు మే26న ఢిల్లీ నుంచి అల్మోరాకు బస్సులో వచ్చిందని తెలిపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 67కేసులు నమోదవగా,  మిగతా వారంతా మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన వారున్నారని పేర్కొంది. అల్మోరా జిల్లాలో 10, డెహ్రాడూన్ 12, హరిద్వార్ 8, నైనిటాల్ 2, పౌరీ గర్వాల్ 2, తెహ్రీ గర్వాల్ 14, పితోరాగఢ్ 7, ఉధంసింగ్‌నగర్ 8, ఉత్తరకాశీలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఐదుగురు కరోనా నుంచి కొలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారని వివరించింది.


logo