బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 13:06:48

బీహార్ ఎన్నిక‌లు.. చివ‌రి రోజున క్వారెంటైన్ ఓట‌ర్ల‌కు అనుమ‌తి

బీహార్ ఎన్నిక‌లు..  చివ‌రి రోజున క్వారెంటైన్ ఓట‌ర్ల‌కు అనుమ‌తి

హైద‌రాబాద్ :  బీహార్ అసెంబ్లీ ట‌ర్మ్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 29వ తేదీన పూర్తి కానున్న‌ది. 243 స్థానాల్లో 38 సీట్లు ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించిన‌ట్లు సీఈసీ సునిల్ తెలిపారు.  ఈవీఎం బ‌టన్ల‌ను నొక్కేందుకు గ్లౌజ్‌ల‌ను ఓట‌ర్ల‌కు ఇవ్వ‌నున్నారు.  క్వారెంటైన్‌లో ఉన్న‌వారికి కూడా ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పిస్తున్నారు. అయితే ఎన్నిక‌ల చివ‌రి ద‌శ‌లో కోవిడ్‌19 రోగుల‌కు అనుమ‌తి క‌ల్పించారు. ఇవాళ బీహార్ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టిస్తూ సునిల్ అరోరా.. పోలింగ్ చివ‌రి తేదీ రోజున క్వారెంటైన్‌లో ఉన్న ఓట‌ర్లు ఓటు హ‌క్కును వినియోగించే విధంగా అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. వారి వారి పోలింగ్ స్టేష‌న్ల వ‌ద్ద ఈ అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.  ఆరోగ్య‌శాఖ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో క్వారెంటైన్ ఓట‌ర్లు ఓటు హ‌క్కును వినియోగించుకుంటారు.  క్వారెంటైన్ ఓట‌ర్ల‌కు పోస్ట‌ల్ ఓటింగ్‌కు కూడా అనుమ‌తి ఇచ్చారు.  పోస్ట‌ల్ ఓటింగ్‌కు అద‌నంగా .. పోలింగ్ చివ‌రి రోజున బూత్‌లో ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించారు.  పోలింగ్ స‌మ‌యాన్ని ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిర్ధారించారు. అయితే పెంచిన గంట స‌మ‌యం.. తీవ్ర‌వాద ప్ర‌భావిత ప్రాంతాల‌కు వ‌ర్తించ‌ద‌ని సీఈసీ సునిల్ అరోరా తెలిపారు. 


logo