బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 08:48:01

మృత‌దేహాల మ‌ధ్య క‌రోనా బాధితుల‌కు చికిత్స‌... వీడియో

మృత‌దేహాల మ‌ధ్య క‌రోనా బాధితుల‌కు చికిత్స‌... వీడియో

మ‌హారాష్ట్ర‌: న‌ల్ల‌టి ప్లాస్టిక్ క‌వ‌ర్ చుట్టిన మృత‌దేహాలు బెడ్‌ల‌పై ప‌డుకోబెట్టి ఉన్నాయి. మ‌రో వైపు క‌రోనా పాజిటివ్ బాధితుల‌కు అదేగ‌దిలో చికిత్స అందిస్తున్నారు. కొన్ని శ‌వాల‌కు క‌నీసం వ‌స్త్రం కూడా క‌ప్పి లేదు. అందులోనే కోవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ దృశ్యాలు ముంబైలోని సియోన్ ఆస్ప‌త్రిలో కోవిడ్‌-19 వార్డులోనివి. జీవించి ఉన్న రోగుల ప‌క్క‌న ఆరుకు పైగా శ‌వాల‌ను అలాగే ఉంచారు. మ‌హార‌ష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితేష్ ఎన్ రాణే ఈ వీడియోను పోస్ట్ చేశాడు. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి నుంచి క‌రోనా వేగంగా వ్య‌ప్తి చెందుతుంద‌న్న విష‌యాన్ని వైద్యులు, ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

దీనిపై స్పందించిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం రోగులు పెరుగుతున్న కొద్ది, చ‌నిపోయిన వారిని ఉంచ‌డానికి శ‌వాల గ‌దులు స‌రిపోవ‌డం లేదు. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి స‌మ‌యం ప‌డుతున్నందున శ‌వాల‌ను అలాగే ఉంచాం. మృత‌దేహాల నుంచి వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం ఎటువంటి స‌హాయం చేయ‌కుండా, స్థానిక ఎమ్మెల్యేల‌తో ఇటువంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయిస్తుంద‌ని మండిప‌ట్టారు. స్థానికంగా మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌డానికి స్థ‌లం స‌రిపోక ఆల‌స్యం అవుతుంద‌ని పేర్కొన్నారు. ఆ గ‌దిలో ఉన్న రోగుల‌కు మాన‌సికంగా ఎటువంటి స‌మ‌స్య రాకుండా కౌన్సెలింగ్ నిర్వ‌హించామ‌ని తెలిపారు. 


logo