శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 16:53:52

క‌రోనా సోకిన యువ‌కుడు ప‌రార్.. క్వారంటైన్ లో 40 కుటుంబాలు

క‌రోనా సోకిన యువ‌కుడు ప‌రార్.. క్వారంటైన్ లో 40 కుటుంబాలు

ల‌క్నో : క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన ఓ యువ‌కుడు, అత‌ని కుటుంబ స‌భ్యులు పారిపోయారు. దీంతో ఓ 40 కుటుంబాల‌ను క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు, వైద్యాధికారులు. 

యూపీలోని హ‌ర్దోయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం గ‌త కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వ‌ల‌స వెళ్లారు. ఢిల్లీ నుంచి ఈ నెల 15వ తేదీన త‌మ సొంత గ్రామ‌మైన తెర్వాద‌హిగావ‌న్ కు చేరుకున్నారు. 16వ తేదీన ఓ పెళ్లికి వారు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కుటుంబంలో ఇద్ద‌రికి క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో.. ర‌క్త న‌మూనాల‌ను వైద్యుల‌కు ఇచ్చారు.

మొత్తం కుటుంబ స‌భ్యులైన ఆరుగురిలో.. 18 ఏళ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన వైద్యాధికారులు.. ఆ కుటుంబం వ‌ద్ద‌కు చేరుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంత‌లోపే యువ‌కుడితో పాటు మిగ‌తా కుటుంబ స‌భ్యులు పారిపోయారు.

ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ఆ గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 40 కుటుంబాల‌ను క్వారంటైన్ లో ఉంచారు. యువ‌కుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.   


logo