గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 17:11:07

గొంతు కోసుకుని క‌రోనా బాధితుడి ఆత్మ‌హ‌త్య‌!

గొంతు కోసుకుని క‌రోనా బాధితుడి ఆత్మ‌హ‌త్య‌!

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని సంగ్లి జిల్లాలో దారుణం జ‌రిగింది. క‌రోనా సోకిన ఓ 56 ఏండ్ల‌ వ్య‌క్తి క‌త్తితో గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సంగ్లి జిల్లా మిరాజ్‌లోని ఓ ఆస్ప‌త్రి కొవిడ్ కేర్ విభాగంలో ఈ దారుణం జ‌రిగింది. బాధితుడు ఆస్ప‌త్రి బెడ్‌పై కూర్చుని గొంతు కోసుకున్న దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే వైద్యులు అత‌న్ని ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు త‌ర‌లించి బ‌తికించే ప్ర‌య‌త్నం చేసినా సాధ్యం కాలేదు. 

బాధితుడు ఈ దారుణానికి పాల్ప‌డ‌టానికి ముందు త‌న కుమారుడికి ఫోన్ చేసి కుటుంబ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని చెప్పిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి. స‌మాచారం అందుకున్న మ‌హాత్మాగాంధీ చౌక్ పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క‌రోనా కార‌ణంగానే అత‌డు ఒత్తిడికి లోనై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు చెప్పారు. మృతుడి ద‌గ్గ‌ర ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించ‌లేద‌న్నారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo