ఆదివారం 24 జనవరి 2021
National - Jan 03, 2021 , 19:47:47

రాజస్థాన్‌లో కరోనా అదుపులోనే ఉంది : సీఎం అశోక్‌ గెహ్లాట్‌

రాజస్థాన్‌లో కరోనా అదుపులోనే ఉంది : సీఎం అశోక్‌ గెహ్లాట్‌

జైపూర్‌ :  రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. కరోనా బారినపడిన వారిలో 96.14 శాతం మంది కోలుకుంటున్నారని తెలిపారు. అనుమానితులందరికీ ఆర్టీ-పీసీఆర్‌ విధానంలో పరీక్షలు చేసినా గత నెలరోజులుగా పాజిటివ్‌ కేసుల శాతం 5 లోపే ఉందని పేర్కొన్నారు. కరోనా ఉధృతి తగ్గిందని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, అజాగ్రత్తగా వ్యవహరిస్తే పరిస్థితి అధ్వానంగా మారే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. 

కరోనా బారినపడి కోలుకున్న వారిలో ఉబకాయం, మానసిక ఒత్తిడి, శ్వాసకోశ, హృదయ, మెదడు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయని, వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలకు దారి తీసే అకాశముందని చెప్పారు. వైరస్‌ బారినపడి కోలుకున్న వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రెండు నెలలపాటు వైద్య నిపుణుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కొవిడ్‌ అనంతర సమస్యల చికిత్సకు ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక క్లీనిక్‌లను ఏర్పాటు చేసిందని, వీటిలో దాదాపు 14 వేల మంది చికిత్స పొందారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం 7 జిల్లాల్లో డ్రై రన్‌ నిర్వహించినట్లు వెల్లడించారు..   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo