మంగళవారం 26 మే 2020
National - May 14, 2020 , 03:26:51

విదేశీ విద్యపై కరోనా ప్రభావం!

విదేశీ విద్యపై కరోనా ప్రభావం!

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే మంచి కొలువును సంపాదించడం ప్రతి భారతీయ విద్యార్థి కల. అయితే కరోనా మహమ్మారి సృష్టించిన విలయం.. విద్యార్థులను వెనుకడుగు వేసేలా చేస్తున్నది. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకున్న 48.46 శాతం మంది భారతీయ విద్యార్థులు తమ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్టు వెల్లడైంది. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు ర్యాంకులనిచ్చే క్వాక్వెరెల్లి సైమండ్స్‌(క్యూఎస్‌) సంస్థ ‘భారత విద్యార్థుల విదేశీ ప్రయాణం 2020: ఉన్నత విద్య అవకాశాలపై కొవిడ్‌-19 ప్రభావం’ పేరిట  విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 


logo