శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 10, 2021 , 17:41:59

జగన్నాథుని ఆలయ ప్రవేశానికి కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ అవసరం లేదు

జగన్నాథుని ఆలయ ప్రవేశానికి కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ అవసరం లేదు

భువనేశ్వర్‌ : పూరీ జగన్నాథుని దర్శనానికి విచ్చేసే భక్తులు కొవిడ్‌-19 నెగెటివ్‌ రిపోర్టు సమర్పించాల్సిన అవసరం లేదని శ్రీ జగన్నాథ్‌ టెంపుల్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎస్‌జేటీఏ) ఆదివారం ప్రకటించింది. 12వ శతాబ్దపు ఈ ఆలయంలోకి ప్రవేశించే భక్తులు జనవరి 21 నుంచి కొవిడ్‌ రిపోర్టు సమర్పించాల్సిన పనిలేదంది. ఎస్‌జేటీఏ చీఫ్‌ కృషణ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ సమ్రత్‌ వర్మ, ఎస్పీ కేబీ సింగ్‌ నేతృత్వంలోని సమావేశం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఎస్‌జేటీఏ అధ్యక్షుడు తెలిపాడు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 9 నెలల తర్వాత భక్తుల దర్శనార్థం జనవరి 3వ తేదీన ఆలయాన్ని తిరిగి తెరిచిన సంగతి తెలిసిందే.